Hospital | మంట ఎక్కువ‌గా పెడుతున్నావ్ అన్నందుకు

Hospital | మంట ఎక్కువ‌గా పెడుతున్నావ్ అన్నందుకు

Hospital | పామర్రుఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో ఘోరం జరిగింది. తనయుడి చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. పామర్రు మండలం కొండిపర్రు డిపి.గూడెంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి నీళ్లు కాసేందుకు మంట ఎక్కువగా పెడుతున్నావ్ అని తండ్రి చదువుల సురేష్ (45) కుమారుడిని మందలించాడు.

మందలించినందుకు కోపోద్రిక్తుడైన తనయుడు చదువుల చంద్ర మహేష్ (22) తండ్రిని కత్తితో మెడపై నరికాడు. మెడ, చేతులపై విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. తీవ్రంగా గాయాల పాలైన సురేష్ ను బంధువులు మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Hospital |

Leave a Reply