మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లకు సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సామూహిక జన్మదిన వేడుకలు శనివారం స్థానిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లతో పాటు 8వ వార్డ్ కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి లను పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బద్ధం యాదిరెడ్డి, ఆకవరం వల్లభాయ్, మర్రి ఆనందం,అవిశెట్టి అవిలిమల్లు, అండెం వెంకట్ రెడ్డి, వారాల యాదగిరి, పి స్వామి రాయుడు,మన్నెం అంజయ్య, బయ్యని వెంకటేశ్వర్లు, దయాకర్ రెడ్డి,యాదగిరి లక్ష్మీ,టి మనోహరా చారి,శంకర్,కలిమెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో… స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు ,శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత్కూర్ ప్రదీప్ శర్మ,అవిశెట్టి యాదగిరి, కూరేళ్ల వెంకట్,వారాల రాకేశ్,బొడిగే శ్రీహరి,గాదేనబోయిన నాగరాజు,గోపాల్‌దాస్ సాయి, కూరేళ్ల విష్ణు, రాజు తదితరులు పాల్గొన్నారు.
