Villagers | బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

Villagers | బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

తుగ్గలి ,ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కడముకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్లిన హెచ్ఎం బాబు, ఉపాధ్యాయులు (Teachers) శేషా నాయక్ ల ను ప్రస్తుత హెచ్ఎం మౌనిక, పాఠశాల కమిటీ చైర్మన్ నెట్టికంటయ్య, గ్రామ ప్రజలు సన్మానించారు. అలాగే నూతనంగా వచ్చిన హెచ్ఎం మౌనిక ను గ్రామస్తులు సన్మానించారు. సన్మాన గ్రహీత, బదిలీపై వెళ్లిన హెచ్ఎం బాబు మాట్లాడుతూ 10 సంవత్సరాలు కడమకుంట్ల గ్రామంలో పని చేశానని, ఆ సమయంలో విద్యాభివృద్ధి కోసం గ్రామస్తులు ఎంతో సహకారం అందించారన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా గ్రామస్తులు సహకారం అందించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఆదిలక్ష్మి, సచివాలయ ఉద్యోగులు పార్వతమ్మ ,భాగ్యలక్ష్మి, బోయ, నాగేంద్ర, సాయినాథ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు మారిక రామాంజనేయులు, గ్రామ రెవెన్యూ సహాయకుడు తలారిచౌడప్ప, గ్రామస్తులు కురువ లింగన్న ,బొగ్గుల సుధాకర్ , మారిక రంగనాయకులు, షేక్ అల్లా బాకాష్, షేక్ చాంద్ బాషా కురువ నరేష్ ,షేక్ కాజా, మారిక శ్రీకాంత్, బొగ్గుల నరేష్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply