నూతనంగా ఎన్నికైన నాయకులకు సన్మానం

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి, వైస్ చైర్ పర్సన్ సంటి లత, కౌన్సిలర్ పర్శ కుశలత లను విద్యా నగర్ కాలనీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాలనీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యానగర్ అభివృద్ధి కొరకు సహకారం అందజేస్తామని తెలిపారు. విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు బోదిరే స్వామి, జేజే నర్సయ్య, పర్శ అనంత్ రావు, విద్యానగర్ కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు నడుకుడ గంగ సాయన్న, మందం భూమేశ్వర్, కోటగిరి హరి, పీరి గంగాధర్, కిషన్, రమేష్, రాజేశ్వర్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులకు పూల మాల, శాలువాతో సత్కరించారు.
