ఘనంగా సన్మానం…

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌ పట్టణంలోని మున్సిపల్ నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ బొదిరే నాగమణి (స్వామి),వైస్ చైర్మన్‌గా ఎన్నికై పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సంటి లత నర్సయ్య లను బుధవారం నాలుగో వార్డ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్ప గుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..భీమ్‌గల్‌ పట్టణ అభివృద్ధికి చైర్మన్, వైస్ చైర్మన్ సమన్వయంతో కృషి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆకాంక్షించారు.

నాలుగో వార్డ్‌లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ బొదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ సంటి లత నర్సయ్య మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధే తమ లక్ష్యమని, అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ కాంగ్రెస్ నాయకులు మందుల కిరణ్, మీసాల నవీన్, బైండ్ల మహేష్, ఉట్నూర్ సురేష్, బర్ల మోహన్, కాపు కుమ్మరి హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply