తహసీల్దార్ నరేష్‌కు ఘన సన్మానం

కొడిమ్యాల, ఆంధ్రప్రభ : కొడిమ్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ డి. నరేష్‌ను శుక్రవారం మీ సేవ నిర్వాహకులు కలసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేష్ మాట్లాడుతూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. ఇంతకుముందు కొడిమ్యాలలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఎం. కిరణ్ కుమార్ మల్యాల మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో నజీర్, గణేష్, రాకేశ్, మల్లేశం, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply