నూతన కౌన్సిలర్ ఇమ్రాన్ కు సన్మానం

చెన్నూర్, ఆంధ్రప్రభ : గతకొద్దిరోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు 11వ వార్డునుంచి గెలుపొందిన మహ్మద్ ఇమ్రాన్ ను స్థానిక గచ్చి మజీద్ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై కాలనిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ కో అప్సన్ సభ్యులు సాదీక్ అలీ, తదితరులు ఉన్నారు.
