శానిటేషన్ సిబ్బందికి సన్మానం

శానిటేషన్ సిబ్బందికి సన్మానం
భీమ్గల్ టౌన్ ,ఆంధ్రప్రభః భీమ్గల్ మున్సిపల్ కార్యాలయ శానిటేషన్ సిబ్బంది ని మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి, వైస్ చైర్మన్ సంటి లత సన్మానం చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది అందజేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. సిబ్బంది కొత్త పాలక వర్గం తో కలిసి సమన్వయంతో కలిసి పని చేయాలని కోరారు. పాలక వర్గం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు చేరువ అయ్యేందుకు సిబ్బంది సహకరించాలని కోరారు. సిబ్బంది అందరిని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్, బోదిరే స్వామి, జేజే నర్సింహా, ఇతర కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు.
