Honor | వాణిజ్య ఒప్పందం చేయడం వల్లే…

Honor | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సన్మానించారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ కృషిని కొనియాడారు. భారత్‌పై ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. భారత్‌పై ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై 50 శాతం సుంకం ఉండగా ఇప్పుడు అది 18 శాతానికి తగ్గుతుంది. ఈ 50 శాతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. ఇప్పుడు అదనపు సుంకాలను తొలగిస్తున్నట్లు అమెరికా తెలిపింది.

Leave a Reply