Honor | నూతన సర్పంచులకు ఘన సన్మానం

Honor | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మండలంలోని నూతన గ్రామాల సర్పంచ్ ల కు కడెం ఎంపీడీవో జె.సునీత ఆధ్వర్యంలో ఇవాళ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, కడెం మండల తహసీల్దార్ ఆర్.ప్రభాకర్, ఎంపీడీవో జే సునీత, ఎంపీ ఓటి శ్రీనివాస్, ఎంఈఓ షేక్ హుస్సేన్, ఈజీఎస్ ఏపీ ఓ జయదేవ్, గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, నూతన సర్పంచులను శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడెం మండల పరిషత్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
