Honor | చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలి

Honor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : యువత చదువుతో పాటు క్రీడారంగంలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నారాయణపేట జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగదీష్ గౌడ్ అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని లక్ష్మీ పల్లి గ్రామ యువకులు శ్రీరామ్ బంగారు పతకం సాధించడంతో సన్మానించి అభినందించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, యువకులు క్రీడారంగంలో రాణించేందుకు ప్రత్యేక కృషి చేయాలని, ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా మంత్రి వాకిటి శ్రీహరి ఉండడంతో క్రీడాకారులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారన్నారు. జాతీయస్థాయి మిక్స్ బాక్సింగ్ పోటీల్లో ఈనెల 26 నుండి 28 వరకు జరిగిన బాక్సింగ్ పోటీల్లో తన ప్రతిభను చాటి రాష్ట్రానికే పేరు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బసప్ప, పురుషోత్తం, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply