AP | శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలపై హోం మంత్రి సమీక్ష !
దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో స్వయంభూగా వెలసిన మహాశివుడిని మంత్రి వంగలపూడి అనిత ఈరోజు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, ఆలయ అధికారులు మంత్రి అనితకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితుల ఆశీర్వదించి.. తీర్ధప్రసాదాలు అందజేశారు.
అనంతరం… మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తో మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.
అంతకముందు.. స్వామివారి దర్శనం సందర్భంగా, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, ధూర్జటి కళా ప్రాంగణంతో పాటు రాజగోపురం పక్కనే ఉన్న స్థలంలో వేదిక ఏర్పాట్లను మంత్రి అనిత పరిశీలించారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల ఎక్కువగా తరలి రానున్న నేపథ్యంలో.. భద్రతా ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.