AP | నారా లోకేష్‌ను కలిసిన హోంమంత్రి అనిత‌ !

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా… మంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని లోకేష్ కు వినతిపత్రం అందజేశారు.

విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బల్క్ డ్రగ్ పార్క్, నక్కపల్లి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

అదేవిధంగా ఎస్.రాయవరంలో బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. నియోజ‌వ‌ర్గంలోని పేద బాలికల చదువుకు వ్యయ, ప్రయాసల ఆటంకం కలగకుండా.. ప్రత్యేక బాలికల కళాశాల ఏర్పాటు చేస్తే ఎంతోమంది అమ్మాయిలకు మేలు జరుగుతుందని మంత్రి వంగలపూడి అనిత నారాలోకేష్‌కు కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *