బాస‌ర‌లో పుణ్య‌స్నానాల‌కు అనుమ‌తి లేదు..

బాసర, ఆంధ్ర‌ప్రభ : బాసర పుణ్యక్షేత్రం (Basara temple) వద్ద గురువారం గోదావరి నదిలో ప్ర‌వాహం పెరిగింది. గంట‌గంట‌కూ నీరు పెరుగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావం, ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురియ‌డంతో గోదావ‌రి (Godavari) కి వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతుంది. బాస‌ర‌లో గోదావరి నదిలో స్నాన‌పు రేవులు మునిగిపోయాయి. దీంతో పోలీసులు (Police), అధికారులు అప్ర‌మ‌త్త‌మై గోదావరి నదిలో పుణ్య స్నానాలకు అనుమతి నిలిపి వేశారు. నది లోపలకు వెళ్లకుండా బారి కేడ్ల ను అడ్డుగా పెట్టారు.

Leave a Reply