BEACH | పుణ్య స్నానాలు..

BEACH | పుణ్య స్నానాలు
BEACH | కోడూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని పాలకాయితిప్ప బీచ్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు కృష్ణా జిల్లాతోపాటు బాపట్ల, గుంటూరు, ఇతర జిల్లాలకు చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పాలకాయితిప్ప (Palakaythippa) వద్ద సముద్ర తీరంలో యువకులు (Young People) సందడి సృష్టించారు. చిన్న పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో విచ్చేసి ఆహ్లాద వాతావరణంలో సంతోషంగా గడిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెరైన్ సీఐ సురేష్ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది జాగ్రత్తలు పాటించారు. సముద్రంలో లోతుకు వెళ్లరాదని, ఇటీవల కాలంలో జరిగిన పలు విషాద సంఘటనల గురించి తెలియ ఆజేశారు. అనంతరం పర్యాటకులు హంసలదీవిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వాని చెలువారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

