పెద్దకాపర్తిలో ఘనంగా హోలీ సంబరాలు

చిట్యాల, ఆంధ్రప్రభ : హోలీ పండుగ గ్రామ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని చిట్యాల మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గ పరిధి చిట్యాల మండలం పెద్ద గ్రామంలో హోలీ పండుగ సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు పెద్దలు యువత చిన్నారులు మహిళలు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు వార్డు సభ్యులు కురు యాదయ్య సాగర్ల నాగరాజు ఆనగంటి నరేష్ తెలు సూరి నరసింహ ఏర్పుల నరసింహ నూతి వెంకటేశం తొలిసూరి సైదులు తదితరు పాల్గొన్నారు.

Leave a Reply