గ్రామ ప్రజల శ్రేయస్సే అయన లక్ష్యం..

వేంసూరు, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజల శ్రేయస్సే ప్రధాన ఏజెండాగా మార్చుకొని పనులు నిర్వహిస్తున్న సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు వాడ వాడలా హర్షం వ్యక్తం అవుతుంది. బుధవారం రాత్రి దోమల నియంత్రణలో భాగంగా గ్రామంలో ఫాగింగ్ చేపడ్డారు. ఇప్పటికే గ్రామంలో పూర్తిస్థాయిలో త్రాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకొచ్చారు. మురుగు కాలువల అభివృద్ధి చేపట్టారు. త్రాగునీటి కాలుష్యం జరగ కుండా పైప్ లైన్ లీకేజీల మరమ్మత్తులు చేపట్టారు. పాఠశాల ఆవరణ, పరిసరాలను పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య చేపట్టారు. 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల అభివృద్ధి చేపట్టారు. ఇలా ప్రతి అభివృద్ధి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి, గ్రామ పంచాయితీ నుంచి ప్రజలకు ఏ సౌకర్యాలు అందించాలో నిరంతరం పరిశీలిస్తూ, ప్రజల గుండెల్లో జననేతగా మారారు.
