హిందూ ముస్లిం భాయ్ భాయ్..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనడమే కాదు.. చేతల్లో చూపించారు వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్. గ్రేటర్ వరంగల్ 18వ డివిజన్ కాశీబుగ్గలో ఆదివారం అయ్యప్ప స్వామి దీక్షాపరులకు బిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా ప్రజలకు ఆ అయ్యప్ప స్వామి ఆశీసులు ఉండాలని హిందూ, ముస్లిం భాయ్ బాయి అనే సోదరభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

అలాగే మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ వరంగల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఏర్పాటుచేసిన అన్నదానం కాంగ్రెస్ పార్టీ లౌకికవాదానికి నిదర్శనమని అన్నారు.

నల్లగొండ రమేష్, మాట్లాడుతూ… సోదరుడు అయూబ్ స్వాములకు బిక్ష ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది కులమతాలకు అతీతంగా ఒక సంకేతం అని మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, యువజన విభాగ అధ్యక్షులు కొరివి పరమేష్, తూర్పు సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్, రాష్ట్ర ఓబిసి కోఆర్డినేటర్ కోదాటి అనిల్, గోరంటలు రాజు, 21వ డివిజన్ సీనియర్ నాయకులు హాజం,ఆలయ అధ్యక్షులు నూతన ఏకాంబరం, కాశీబుగ్గ నాయకులు సతీష్, అయ్యప్ప భక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమూర్తి, ఇమ్రాన్, సునీల్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply