AP | నంద్యాలలో హిజ్రాల వీరంగం

  • రెండు గ్రూపులు రాళ్లతో దాడి
  • పోలీసుల పేక్షక పాత్ర


నంద్యాల : నంద్యాలలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. రెండు వర్గాలుగా విడిపోయిన‌ హిజ్రాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప‌ర‌స్ప‌రం బూతులు తిట్టుకుంటూ, రాళ్లు విసురుతూ దాడులు చేసుకున్నారు. ఒకరిని మరో గ్రూపు వారు పట్టుకొని గుంపుగా చితకబాదారు. నంద్యాల పట్టణంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనారం.

పోలీస్ స్టేషన్ ముందే రాళ్లతో కొట్టుకుంటూ వీరంగం సృష్టించ‌డంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల ముందే రాళ్లు విసురుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. చివరకు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గురువారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply