AP | తిరువూరులో హై టెన్షన్ – మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

  • రసవత్తరంగా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక…..
  • ఇటీవల పదవికి రాజీనామా చేసిన వైసిపి చైర్ పర్సన్…
  • నేడు ఎన్నిక నిర్వహించిన అధికారులు…
  • కేవలం ఏడుగురు సభ్యులే హాజరు…
  • డుమ్మ కుట్టిన వైసిపి కౌన్సిలర్లు…
  • కోరం లేక వాయిదా పడ్డ ఎన్నిక ప్రక్రియ…
  • మున్సిపల్ కార్యాలయం ముందు ఉధృత వాతావరణం…
  • మద్దతుగా ఇరు వర్గాలు మోహరింపు..
  • ఎమ్మెల్యే సారధ్యంలో టీడీపీ శ్రేణులు…
  • దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు…
  • కార్యాలయంలోకి వెళ్లేందుకు వైసిపి కౌన్సిలర్లు వెనకడుగు…
  • ఒకరిని ఒకరు తీసుకునే ప్రయత్నం…
  • మమ్మల్ని అడ్డుకుంటున్నారంటు ఒకరిపై మరొకరు ఆరోపణలు…
  • ఏసీపి ప్రసాద్ ఆధ్వర్యంలో గట్టిబందోబస్తు…
  • సమయం మించి పోవడం, కారం లేక ఎన్నిక వాయిదా…

(తిరువూరు, ఆంధ్రప్రభ) : తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఏడాది క్రితం వరకు 17మంది కౌన్సిలర్లతో తిరువూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట, వర్గ పోరు కారణంగా మున్సిపల్ చైర్ పర్సన్ పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్ కోసం ఎన్నిక అనివార్యమైంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల అనంతరం మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా తిరువూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికను సోమవారం అధికారులు నిర్వహించారు. ఉదయం నుండి ఎన్నిక జరిగే మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కార్యాలయానికి వెళ్లే రెండు ప్రధాన రహదాలకు సంబంధించి ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ వర్గాలు మోహరించి ఉన్నాయి. తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఎన్నిక ప్రక్రియ చూసేందుకు తరలిరావడం, మరోవైపు తమ కౌన్సిలర్లను లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారంటూ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున మోహరించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంతో పాటు, గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికల కోసం రావాలంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తుంటే, మమ్మల్ని కార్యాలయం లోపలికి పంపించడం లేదంటూ వైసీపీ శ్రేణులు, నాయకులు నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఏసీపీ ప్రసాద్ సారథ్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తు, భారీ కేడ్ల‌ను కొంతమంది నెట్టుకుని ముందుకు రావడం జరిగింది.

కోరం లేక వాయిదా..
తిరువూరు ఎన్నికలకు సంబంధించి సోమవారం నిర్వహించిన సమావేశానికి సరైన కోరం లేక ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. మొత్తం 20మంది సభ్యులకు గానూ కేవలం ఏడు మంది సభ్యులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వీరిలో ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు కాగా, మరో నలుగురు కూడా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు. ఈ పరిస్థితుల్లో కోరం లేని కారణంగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు, మరోసారి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామంటూ కమిషనర్ ప్రకటించారు.

Leave a Reply