ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో హై లెవల్ మీటింగ్ !!

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ మళ్లీ రాజకీయ చర్చలకు వేదికైంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు (సోమవారం) దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ అంతర్గత సమావేశంలో.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు దిశపై చర్చ జరిగినట్లు సమాచారం.

ఫామ్‌హౌస్‌ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, శాసనసభ సభ్యులు హాజరయ్యారు. ఇందులో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు. స‌మావేశంలో జరిగిన కీల‌క‌ చర్చలు ప్రధానంగా *కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై న్యాయపరమైన పోరాటం, అలాగే *ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లే దిశగా సాగినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనే ఊహాగానాలు సునామీలా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ ప్రధాన నాయకులకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Leave a Reply