High explosion | బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

High explosion | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో ఈ రోజు తెల్లవారుజామున ఫోమ్ ట్యాంక్(Foam tank) పేలడంతో పెను ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తెల్లవారుజామున 6:40 నిమిషాలకు ఫ్యాక్టరీ లో పీడన ఫోమ్ ట్యాంక్ పేలింది. ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటనం సంభవించడంతో బీబీగూడెం, మున్యా నాయక్ తండ, చివ్వెంల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని చూసేందుకు భారీగా జనాలు(Huge crowd) తరలివచ్చారు. భారీ పేలుడు దాటికి ఫ్యాక్టరీ నుండి కిలోమీటర్ దూరంలో పీడన ఫోమ్ ట్యాంక్ (ఫోమ్ తయారీ ట్యాంక్) శకలాలు పడ్డాయి.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

High explosion

Leave a Reply