కేరళ సెన్సార్ బోర్డుకు హైకోర్టు చురకలు

కేరళ సెన్సార్ బోర్డుకు హైకోర్టు చురకలు
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డ్ తీరుపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాని సరిగా చూడకుండానే సర్టిఫికెట్ ఇచ్చారని మండిపడింది. సినిమాలో వివాదాస్పద దృశ్యాలు ఉన్నాయని ధర్మసనం పేర్కొంది. కేరళ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని, అయితే ఈ చిత్రంతో రాష్ట్రంలో ఏదో విపత్తు జరిగిపోతోందనే తప్పుడు సంకేతాలు పంపిస్తోందని జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో సినిమా సర్టిఫికేషన్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని.. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. కాగా ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
