తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాళేశ్వ‌రం అక్ర‌మాల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం(State Government) నియ‌మించిన పీసీ ఘోష్ క‌మిష‌న్ ఆధారంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు(BRS Siddipet MLA Harish Rao)ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్(Commission Report) ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హ‌రీశ్‌రావు(KCR, Harish Rao) త‌ర‌పు న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు. అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply