Hero Vijay | షాకింగ్.. జన నాయగన్ రావడం లేదు..

Hero Vijay | షాకింగ్.. జన నాయగన్ రావడం లేదు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన భారీ, క్రేజీ మూవీ జన నాయగన్. ఈ చిత్రానికి హెచ్ వినోద్ డైరెక్టర్. ఇది విజయ్ ఆఖరి చిత్రం(Vijay’s last film). సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. విడుదల కావడానికి కేవలం రెండు రోజుల ముందు ఈ సినిమాని వాయిదా వేస్తున్నామని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ(KVN Productions Company) ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇంతకీ.. ఏమైంది..?

జన నాయగన్ మూవీని వాయిదా వేస్తున్నట్టుగా కెవిన్ సంస్థ సోషల్ మీడియా(Kevin’s company social media) ద్వారా తెలియచేసింది. మా విలువైన వాటాదారులకు.. ప్రేక్షకులకు ఈ వార్తను తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం. జనవరి 9న మోస్ట్ అవైటెడ్ జన నాయగన్ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అని అనౌన్స్(Announcement that it has been postponed) చేశారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఉత్సాహం, భావోద్వేగాలను మేం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఈ నిర్ణయం అంత ఈజీ కాదు.. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం. అప్పటి వరకు మీ సహనాన్ని, నిరంతర ప్రేమను వినయపూర్వకంగా కోరుతున్నాం. మీ నుంచి మద్దతే మాకు గొప్ప బలం అని తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే.. ఈ మూవీని సెన్సార్(Censor the movie) కోసం డిసెంబర్ లో పంపిస్తే.. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి తొలిగించాలి అన్నారు. సెన్సార్ సూచనల మేరకు మార్పులు చేసినా సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఇరు తీర్పులు విన్న జస్టీన్ తీర్పును రిజర్వ్(Justin reserves judgment) చేశారు. జనవరి 9న ఉదయం తుది తీర్పు వెల్లడించనున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేసినట్టు ప్రకటించారు.

