Hero | రాజశేఖర్‌కు గాయాలు.. అసలు ఏం జరిగింది..?

Hero | రాజశేఖర్‌కు గాయాలు.. అసలు ఏం జరిగింది..?

Hero, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొంత విరామ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూ, మరో వైపు వేరే హీరో సినిమాల్లో ప్రధాన పాత్రల్లో(In the main roles) నటిస్తున్నారు. నవంబర్ 25న కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా కుడి కాలికి గాయాలు అయ్యాయి. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… రాజశేఖర్ కుడి కాలికి మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ(Major injury) అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు హాస్పటల్ కి తీసుకు వెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగిందని సమాచారం.

బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందట. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారని.. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు(Hospital categories) తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలియచేసాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు. సర్జరీ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు(For four weeks) తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాజశేఖర్ కు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గాయమైన కాలిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదపకూడదని చెప్పారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. జనవరి 2026 లో మళ్ళీ షూటింగ్ ప్రారంభించవచ్చు.

Hero | గాయాలు కావడం మొదటిసారి కాదు..

రాజశేఖర్‌కు ఈ విధంగా గాయాలు కావడం మొదటిసారి కాదు. నవంబర్ 15, 1989లో మగాడు షూటింగ్(Magadu shooting) చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైతే, ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత నవంబర్ నెలలోనే మళ్ళీ ఆయనకు గాయమైంది. గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్లు(Action scenes) చేస్తున్నారు. రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ బైకర్. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల టైటిల్స్ ఖరారు చేయలేదు. రికవరీ తర్వాత ఆ రెండు సినిమాల షూటింగ్స్(Film shootings) స్టార్ట్ అవుతాయని సమాచారం.

Hero

CLICK HERE TO READ రూ.3 కోట్లు లూటీ

CLICK HERE TO READ MORE

Leave a Reply