ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిళ్ళు, స్కూటర్ల తయారీదారు హీరో మోటోకార్ప్, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో తన తిరుగులేని నాయకత్వాన్ని మరోసారి నిరూపించుకుంది.
ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FADA) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, హీరో మోటోకార్ప్ FY’25, మార్చి 2025 రెండింటికీ రిటైల్ అమ్మకాలు, మార్కెట్ వాటా పరంగా అగ్ర ద్విచక్ర వాహన బ్రాండ్‌గా అవతరించింది.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) రిటెయిల్ డేటా ప్రకారం – హీరో మోటోకార్ప్ FY25లో 54,45,251 రిటైల్ యూనిట్లను విక్రయించి, 29% మార్కెట్ వాటాతో ఆధిపత్యాన్ని కొనసాగించింది.
హోండా మోటార్ సైకిల్, స్కూటర్ భారత్‌లో 47,89,283 యూనిట్లతో (25.3%) తదుపరి స్థానంలో ఉండగా, టీవీఎస్ మోటార్ కంపెనీ 33,01,781 యూనిట్లతో (17.4%), బజాజ్ ఆటో 21,54,467 యూనిట్లతో (11.4%) విక్రయాలు చేసుకున్నాయి.
మార్చి 2025లో మాత్రమే, హీరో మోటోకార్ప్ 435,828 యూనిట్లను రిటెయిల్ చేసింది. ఇది హోండా 356,083 యూనిట్లతో గణనీయంగా ముందుంది. ఇది భారతీయ వినియోగదారులలో అత్యంత ఇష్టపడే ద్విచక్ర వాహన బ్రాండ్‌గా తన స్థానాన్ని మరోసారి నిలబెట్టకుంది.
హీరో మోటోకార్ప్ స్థిరమైన రిటెయిల్ నాయకత్వం దాని వైవిధ్యమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్, భారతదేశంలో పట్టణ, గ్రామీణ మొబిలిటీ అవసరాలపై లోతైన అవగాహన ఫలితంగా దక్కించుకుంది.
ఇంధన-సమర్థవంతమైన కమ్యూటర్ల నుంచి VIDA బ్రాండ్ కింద ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు, కంపెనీ నమ్మకమైన, అందుబాటులో, విశ్వసనీయ మొబిలిటీ వాగ్దానాన్ని అందించడాన్ని కొనసాగించింది.