అందుకే నిధులు

అందుకే నిధులు
- మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
టంగుటూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలోనిధులు మంజూరు చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి(Dr Dola Bala Veeranjaneya Swami) తెలిపారు. శనివారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 77 మంది లబ్ధిదారులకు రూ.53.71 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister’s Relief Fund) నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు కొండపి నియోజకవర్గ పరిధిలో 77 మందికి 53 లక్షల 71 వేల రూపాయలు చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. తల్లి కి వందనం పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సహాయం అందచేయడం జరుగుచున్నదన్నారు.
మత్స్యకార సేవలో ద్వారా సంవత్సరానికి 20 వేల రూపాయలు వంతున, అలాగే ఆటో డ్రైవర్ల సేవ(Auto Drivers Service)లో ద్వారా సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
