అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత

అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత
రూ.37,116 విలువ గల పనిముట్లు అందించిన తోటి వ్యాపారులు
మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలోని భువనగిరి రోడ్డులో ఉన్న శ్రీ మణికంఠ ఆటో ఎలక్ట్రికల్ వర్క్స్ లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించి సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. ఆదివారం స్థానిక వెల్డింగ్ వర్కర్స్ ,ట్రాక్టర్ మెకానిక్, ఆటోమొబైల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాధితుడు ఏనుగు లింగారెడ్డికి రూ. 37,116 విలువైన యంత్రాలను కొనిచ్చి స్వయంగా అందజేసి తమ దయార్ద్ర హృదయాన్ని చాటుకొని తోటి వ్యాపారునికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ముప్ప వెంకట్ రెడ్డి, ప్రతినిధులు లింగాల జైపాల్ రెడ్డి, తమ్మినేని శ్రీనివాసరావు, బి వెంకటేశ్వరరావు, ముప్ప తిరుమలరెడ్డి ,ముప్ప మల్లారెడ్డి,మరాఠీ అంజయ్య,అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.
