Help l దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం

Help l దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం

Help l విజయవాడ,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి జీవితాల్లో భరోసా నింపుతోందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. కృష్ణలంకకు చెందిన దివ్యాంగుడు షేక్ నూర్ అహ్మద్ కు రోబోటిక్ కృత్రిమ కాలు అమర్చే నిమిత్తం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆదేశాల మేరకు గద్దె క్రాంతి కుమార్ 15,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని 8వ డివిజన్ మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని రోబోటిక్ రిహభిటేషన్ సెంటర్ లో అందజేశారు.

దివ్యాంగులకు ఆర్థిక భద్రత, స్వావలంబన, గౌరవప్రదమైన జీవనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెన్షన్లు, సహాయక పరికరాలు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలను విస్తృతంగా అందిస్తోందని గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యంగులకు రూ. 2 లక్షలు విలువ చేసే మోటార్ వాహనాలు కూడా అందజేసి వారికి అండగా నిలిచారన్నారు. దివ్యాంగుల విషయంలో ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆయన సొంత నిధులతో అనేకమంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఉపాధి కోసం బడ్డీ కోట్లు అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు వ్యక్తిగతంగా దివ్యాంగుల బాధలు అర్థం చేసుకుని సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కు ఆయన తనయుడు గద్దె క్రాంతి కుమార్ కు దివ్యాంగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, మల్లెల రామకృష్ణ, నారు రామారావు, సూర వెన్నెల, కొరగని నీలిమా, ఎలీష తదితరులు ఉన్నారు.

Leave a Reply