Helicopter Crash | హెలికాప్టర్ కూలి.. ఐదుగురి మృతి

Helicopter Crash | హెలికాప్టర్ కూలి.. ఐదుగురి మృతి

Helicopter Crash | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆఫ్రికాలోని అత్యంత ఎత్త‌యిన‌ కిలిమంజారో పర్వతం (Mount Kilimanjaro)పై ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది (Helicopter Crash). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కిలిమంజారో పర్వతంలోని బరాఫు శిబిరం స‌మీపాన‌ హెలికాప్టర్‌ కూలిపోయినట్లు పేర్కొంది. మృతుల్లో ఓ గైడ్‌, వైద్యుడు, పైలట్‌, ఇద్దరు విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కిలిమంజారో పర్వతం సముద్ర మట్టానికి దాదాపు 6,000 మీటర్ల(6,000 meters) ఎత్తులో ఉంటుంది. తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Leave a Reply