ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) వర్షం ముప్పు తొలగిపోలేదు. మూడు జిల్లాల్లో భారీ వర్ష (Heavy rains) సూచన ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. దీనివల్ల కామారెడ్డి(Kamareddy), మెదక్(Medak), సిద్ధిపేట (Siddipet) జిల్లాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
మధ్య ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో ఉన్న అల్పపీడనం కూడా ఈ వర్షాలకు దోహదం పడనుంది. సముద్ర ఉపరితలంలోని 8 కి.మీ సర్క్యులేషన్ వల్ల బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు తెలంగాణ మీద కలిసి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24-48 గంటల్లో కామారెడ్డిలో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 60 సెం.మీ., సిద్ధిపేటలో 20 సెం.మీ. కంటే ఎక్కువ, మెదక్ లో 30 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.