మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెదక్(Medak) పట్టణంలో ఈ రోజు కుండపోత వర్షం(Rain) కురిసింది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కమ్ముకొని ఉంది. దీంతో ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మెదక్ పట్టణంలో ఈ రోజు ఉదయం ఆకాశం మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. పాఠశాలలకు వెళ్లవలసిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
