గంటన్నర పాటు కుంభ వృష్టి..

గుంటూరు బ్యూరో – ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షం, పిడుగుల బీభత్సం నలుగురు దుర్మరణం చెందారు. పెద్దకాకాని మండలం నంబూరులో దాసరి సారమ్మ (39), రాణి (41), పెదనందిపాడు మండలం అనుమర్రులో దేవరపల్లి సామ్రాజ్యం (61), తన్నీరు నాగమ్మ (41) పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు.
ఈ విషాద సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర విచారాన్ని నింపింది. ఇదే సమయంలో, గుంటూరు నగరంలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సుమారు గంటన్నర పాటు కుంభవృష్టి కురిసింది. ఎడతెరిపి లేని వర్షం, మెరుపులు, ఉరుములతో నగరం దద్దరిల్లింది.
లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత కారణంగా ప్రత్యామ్నాయ మార్గమైన మూడు వంతెనల దారి వర్షపు నీటితో నిండిపోయింది. బ్రాడీపేట, ఆరండల్ పేట, కంకరగుంట అండర్ పాస్, రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరి, మోకాలి లోతు నీరు నిలిచింది.
వాహనాలు సగానికి మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్తపేటలో ఓ పెద్ద చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ తీగలు తెగడంతో కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు వర్షం నుంచి తలదాచుకోలేక అల్లాడిపోయారు. వర్షం తగ్గిన వెంటనే కార్పొరేషన్, విద్యుత్ శాఖలు పునరుద్ధరణ పనులను చేపట్టాయి.
శనివారం ఎడతెరిపిలేని వాన గుంటూరు నగరాన్ని ఊపిరి తీసుకొనివ్వలేదు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం అయిన వర్షం సుమారు 4 గంటల వరకు నగరాన్ని ముద్ద చేసింది. దీనికి తోడు మెరుపులు, ఉరుముల శబ్దాలతో ఆకాశం దద్ధరిల్లింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత క్రమంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్న మూడు వంతెనల దారి ఆసాంతం వర్షపు నీటితో నిండి పోయి వాహనదారులు అల్లాడి పోయారు. బ్రాడీపేట, ఆరండల్ పేట, కంకరగుంట అండర్ పాస్, రింగ్ రోడ్డు తదితర రహదారుల మీదకు డ్రైన్ల నుండి పొంగిన నీరు చేరిపోయింది.
మోకాలి లోతు జమ కావడంతో వాహనాలు సగానికి మునిగిపోయే పరిస్తితి ఏర్పడింది. అలాగే కొత్త పేటలో పెద్ద చెట్టు ఒకటి కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. విద్యుత్ తీగలు తెగి కొన్ని ప్రాంతాల్లో కరెంట్ నిలిచిపోయింది. అనేక పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఎక్కడ తల దాచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వర్షం ముగియగానే కార్పొరేషన్, విద్యుత్ శాఖ రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టారు.
