6.47 లక్షల క్యూసెక్కుల నీరు చేరిక
23 అడుగులకు ఎత్తిన పది గేట్లు
సాగర్ కు 6.09 లక్షల క్యూసెక్కులు విడుదల
(నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ) : కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project)లోకి వరద ఉధృతి పెరిగింది. ఏడు సంవత్సరాల తర్వాత కృష్ణా నది (Krishna River)లోకి వస్తున్న భారీ వరద చేరుతున్న తరుణంలో.. 10 రేడియల్ క్రస్ట్ గేట్ల (10 radial crest gates)ను 23 అడుగుల మేర ఆదివారం పైకి ఎత్తి నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కు నీరు విడుదల చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి 6,47,179 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇందులో స్పీల్ వే నుంచి 5,11,092 క్యూసెక్కుల నీరు, సుంకేసుల జలాశయం నుంచి 1,05,887, క్యూసెక్కుల నీరు హంద్రీ నుంచి 30,200 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలోకి చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరుకొంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత జలాశయంలో 204.3520 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.
శ్రీశైలం జలాశయం నుంచి ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి కోసం 64,759 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యుత్ ఉత్పత్తి కోసం 29,444 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. గత ఏడేళ్ల కిందట వచ్చిన వరద తీవ్రతతో 23 అడుగుల మేర 10 గేట్ల ఎత్తి కిందకి వదిలారు. 2018 తర్వాత గేట్లను 23 అడుగులకు ఎత్తటం ఇదే తొలిసారి. ఒక గేటు ఎత్తు 55 అడుగులు, వెడల్పు 60 అడుగులు ఉంటుంది.
సాధారణంగా గేట్లు ఎప్పుడు పది అడుగులు ఎత్తి వీటిని కిందికి విడుదల చేస్తారు. ఈ ఏడాది 23 అడుగులు ఎత్తటంతో జనంలో అలజడి మొదలైంది.ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu)ఆధ్వర్యంలో మొదటిసారిగా శ్రీశైలం నిండటంతో జూన్ 4 వ తేది న గంగమ్మ పూజ చేసి సాగర్ కు నీరు విడుదల చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు గేట్లు ఎత్తటం దించటం ఏడుసార్లు పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం కనువిందు చేస్తోంది.

