Heart attack | ఆ బాధలోనే…

Heart attack | ఆ బాధలోనే…

Heart attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని, ఇంటర్ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి ధైర్యం నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది.

సంగం మండల కేంద్రానికి చెందిన కందం రాంసాయి అనే ఇంటర్ విద్యార్థి తండ్రి నిన్న రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషాద సమాచారం తెలిసినా బంధువులు, లెక్చరర్లు ధైర్యం చెప్పడంతో రాంసాయి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. పరీక్ష పూర్తయిన తర్వాతే తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ ఘటనపై స్థానికులు, విద్యార్థి సహచరులు రాంసాయి ధైర్యాన్ని, నిష్ఠను కొనియాడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా చదువుపై దృష్టి పెట్టిన రాంసాయి చర్య అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది.

Heart attack |

Leave a Reply