Heart Attack | గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి

Heart Attack | ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి : భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వనగంటి లక్ష్మి గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి పరామర్శించి పార్థివ‌ దేహానికి నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా రూ. 20వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిచిన సర్పంచ్ అభ్యర్థి చిక్కుల వెంకటేశం, మాజీ ఎంపీపీ వెంకట స్వామి, మాజీ సర్పంచ్ ఉడుత సత్యనారాయణ, ఉడుత నరేష్, సాయి కిరణ్, కాంగ్రస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply