సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్

సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఆరోగ్యవంతమైన తల్లి – ఆరోగ్యవంతమైన శిశువు గ్రామ అభివృద్ధికి పునాది లాంటివారని మండేలగూడెం గ్రామ సర్పంచ్ డ్యాగల రాజ శేఖర్ అన్నారు. బుధవారం రఘునాథపల్లి, మండలం మండెలాగూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలు 1. 2లో ఈరోజు హెల్త్ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లి శిశు ఆరో గ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డ్యాగల్ రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి గర్భిణీ మహిళ గర్భధారణ ప్రారంభ దశలోనే నమోదు చేసుకోవడం చాలా అవసరం.

సమయానికి టిటి వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా తల్లి, శిశువును ప్రమాదాల నుంచి రక్షించవచ్చని అన్నారు. మొదటి మూడు నెలలలో ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలని. తరువాత 180 ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వాడటం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని వివరించారు. పిల్లలకు సమయానికి టీకాలు వేయించడం, వారి ఎదుగుదలకు సరైన పోషకాహారం అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ కొమురయ్య, గ్రామ సెక్రటరీ రమేష్. ల్, ఆశ వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Leave a Reply