బడికి డుమ్మా కొట్టాడనే..
ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన డీఈఓ
శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ ): జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని కొత్తచెరువు మండలం కేశాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనాథ్ రెడ్డి ని విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఈఓ క్రిష్ణప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుడిగా ఉంటూ రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొనడం, బడికి సక్రమంగా హాజరు కాకపోవడం వంటి ఆరో పణలు ఆయనపై వచ్చాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆయన పనితీరు పై విచారణ చేసిన అనంతరం నిజమని రుజువు కావడంతో ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల సైతం రాజకీయాలకు దూరంగా ఉండి విధులు నిర్వర్తించుకోవాలని ఈ సందర్భంగా డీఈఓ హితవు పలికారు.

