మత్స్యకారుల స్థితిగతులు ఆయనకు తెలుసు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం (Srikakulam) రూరల్ మండలం పీజే పేట సముద్రతీరం కోతకు గురి అవుతుందని అందువల్ల తీర ప్రాంత ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. మంగళవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అలల తాకిడి మరింత తీవ్రంగా మారిందని, దీన్ని ప్రజలు గమనించి తగు జాగ్రత్తలు పాటించాలని.. అత్యవసర పరిస్థితులు వస్తే వాటిని నియంత్రించేందుకు ముందస్త ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరు అధైర్య పడకండని.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నామని అయితే ప్రజలు మాత్రం పూర్తి అవగాహనతో ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మత్స్యకారుల స్థితిగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు తెలుసని అందువల్ల పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉండాలన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలని తక్షణమే సహాయక చర్యలు అందుతాయి అని తెలిపారు.

