HBD | తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
బర్త్‌డే కేక్ కట్‌చేసిన కేటీఆర్
మాజీ సీఎంపై రూపొందించిన డాక్యుమెంటరీ వీక్షించిన నేతలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నాయకులు హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ పై రూపొందించిన డాక్యూమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.