పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన

పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గురువారం శుక్రవారం వాన రాళ్లవర్షం కురవడంతో కొంత విద్యుత్ అంతరాయం నెలకొంది. మండల రైతులు మిర్చి ఆరబోసే కల్లాలపై వర్షంనీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపారుల వద్ద తెచ్చిన అప్పుల బాధ, మరొక పక్క ఈదురుగాలి రాళ్లతో వర్షం కురవడంతో రైతులు భయాందోళనతో బిక్కు బిక్కు మంటూ మిర్చి తోటలో దివాళి తీశారు.
ఇదిలా ఉండగా పల్లె ప్రాంతాల్లోని, గూడాలలో, పశువుల పాకలు, పూరిగుడిసెలు, సిమెంట్ రేకులు సైతం నేలమట్టమై ప్రజలకు, బాధితులకు కొంత ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. పశువులు, మేకలు, గొర్రెలు, ప్రజలు సైతం ఉరుమల మెరుపులతో, ఆందోళనకు లోనయ్యారు. దాంతో విద్యుత్ సమస్య తలెత్తడంతో ఇంటి పరిసర ప్రాంతాల్లోని విషపురుగులు సంచారం చేస్తాయని భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని, మొబైల్ సెల్ లైట్, టార్చ్ లైట్, కొవ్వొత్తులను వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది.
మరికొన్ని గ్రామాల్లోని రైతులకు సంబంధించిన యాసంగి పంటలు వరిధాన్యం, మొక్కజొన్న పంటలతో కొంత ఉపశమనం కలిగినప్పటికీ, మిర్చి రైతులు మాత్రం కన్నీటి పాలుకావడం రైతులు దివాళి తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు రాత్రి వేళల్లో నిత్యవసర సరుకులను తెచ్చుకునేందుకు తీవ్రఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా మండలంలో భారీ వర్షం ఉరుములు మెరుపులతో, రాళ్లతో కూడిన వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఇండ్లకే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడడంతో మండల ప్రజలందరూ గృహాలకే పరిమితమై పిల్లలు పెద్దలు వృద్ధులు ఒకే చోట కూర్చుని దిక్కుబిక్కుమంటూ, రాత్రి కాలం వెళ్లదీయడం ప్రాణాలను కాపాడుకోవడం ప్రజలకు పరిపాటిగా మారింది.
