Hasanparthy | నిష్పక్ష వార్తలతో ప్రజలకు చేరువైన ఆంధ్రప్రభ

Hasanparthy | నిష్పక్ష వార్తలతో ప్రజలకు చేరువైన ఆంధ్రప్రభ

Hasanparthy | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : నిష్పక్ష వార్తలతో ప్రజలకు చేరువైన ఆంధ్రప్రభ సమాజంలో అందరి మన్ననలను పొందుతున్నదని హసన్ పర్తి పశువైద్యాధికారి తిరుక్కచ్చి మాళవిక కొనియాడారు. ఈ రోజు హసన్ పర్తి ప్రాధమిక పశు వైద్య కేంద్ర ఆవరణలో 2026 ఆంధ్రప్రభ క్యాలెండర్ ను స్థానిక విలేకరి వేల్ఫుల ఓదేలు ఆధ్వర్యంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 1938 నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పనిచేయడం చరిత్రలో ఒక గొప్ప విశేషమని కొనియాడారు. మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్ ఎడిషన్ తో తాజా వార్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ పత్రిక రంగంలో ముందు వరుసలో వెళ్తున్నదని అన్నారు. నిజాలను నిర్భయంగా వార్తలు రాస్తూ ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న ఆంధ్రప్రభ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది ఎండీ సాధిక్, రాహుల్ లు పాల్గొన్నారు.

Leave a Reply