Harish Rao | అబద్దాలు చెప్పిన మంత్రి ఉత్తమ్

Harish Rao | అబద్దాలు చెప్పిన మంత్రి ఉత్తమ్

Harish Rao | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఫిలిప్పీన్స్‌కు బియ్యం పంపడంలో కుంభకోణం జరిగిందని, బియ్యం రవాణాలో మంత్రి ఉత్తమ్​ కొన్ని అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ… అనేక కేసులున్న ప్రేమ్‌చంద్ గార్గ్‌ను సలహాదారుగా పెట్టుకున్నారన్నారు.

ప్రేమ్‌చంద్ గార్గ్‌ ఇప్పుడు ఎక్కడున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే డబ్బు ఇస్తామని నాఫెడ్ చెప్పిందని, బియ్యం ఎగుమతి కోసం ఏమైనా టెండర్లు పిలిచారా..? అని హరీశ్‌రావు ప్ర‌శ్నించారు. నాఫెడ్‌కు అనుమతి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థకు ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. కాకినాడ పోర్టులో 7,500 టన్నుల బియ్యం ఉన్నది నిజమా.. కాదా చెప్పాల‌న్నారు.

కాకినాడ పోర్టులో గిడ్డంగి, నిర్వహణ ఛార్జీలు చెల్లిస్తున్నారా.. లేదా..? బియ్యం రవాణాలో స్కామ్ జరిగింది.. ప్రభుత్వానికి నష్టం జరిగిందన్నారు. బియ్యంపై హౌస్ కమిటీ వేయండి.. త‌న‌ను కూడా సభ్యుడిగా ఉంచండని హరీశ్‌రావు అన్నారు. సీబీఐ, ఈడీ కేసులున్న వ్యక్తిని సలహాదారుగా ఎలా పెట్టుకుంటారని, నామినేషన్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు ఎలా అనుమతి ఇస్తారని హరీశ్‌రావు ప్ర‌శ్నించారు.

Leave a Reply