Harish Rao | అహంకార చర్యలను అడ్డుకుంటే అరెస్టులా..?

Harish Rao | అహంకార చర్యలను అడ్డుకుంటే అరెస్టులా..?

  • బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలి

Harish Rao |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాల్క సుమన్‌ అరెస్ట్‌ను హరీష్‌రావు ఖండించారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.. అధికార, పోలీస్‌, ధన బలంతో చట్టాలు తుంగలో తొక్కారన్నారు. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట.. కాంగ్రెస్ మార్క్‌ గూండాగిరి రాజ్యమేలుతోందన్నారు. హంగ్‌ వచ్చిన చోట కిడ్నాప్‌లు చేస్తున్నారన్నారు. అడ్డదారుల్లో చైర్మన్ పీఠాలు దక్కించుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

Leave a Reply