హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దేశవ్యాప్తంగా శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోనున్న‌ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవ జీవితంలో భగవద్గీత బోధనలు అపారమైన ప్రభావం చూపుతాయని, జీవన ప్రతి దశలో కృష్ణ భగవానుడు స్ఫూర్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.

మహావిష్ణువు దశావతారాల్లో కృష్ణావతారం అత్యంత ప్రత్యేకమైందని, దుష్టసంహారంతో పాటు మానవాళికి అవసరమైన భగవద్గీతను అందించారని సీఎం గుర్తు చేశారు. కృష్ణ తత్వాన్ని సరిగ్గా అవగాహన చేసుకుంటే జీవనంలోని ప్రతి రంగంలో విజయం సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలందరిపైనా కృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply