ఘ‌నంగా భక్త కనకదాసు జ‌యంతి

నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : భక్త కనకదాసు గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ సునీల్ షొరా ణే పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జయంతి వేడుకలను ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ ముందుగా భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎస్ పి మాట్లాడుతూ భక్త కనకదాసు గొప్ప భక్త కవి, సంగీతకారుడు, తత్వవేత్త అని తెలిపారు. మొదట ఆయన యోధుడిగా పనిచేశారు.

కానీ తరువాత భగవంతుని కృపతో భక్తిమార్గాన్ని స్వీకరించి హరిదాసు సంప్రదాయంలో శ్రేష్ఠ స్థానాన్ని పొందారన్నారు. ఆయన రచించిన కీర్తనలు, పాటలు, కథలు భక్తి, నీతి, వినయం, సమానత్వాన్ని బోధిస్తాయ‌ని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. యుగంధర్ బాబు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్లు మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply