భీమ్‌గల్‌ కు రానున్న ప్రసిద్ధ వేద విద్వాంసులు

భీమ్‌గల్‌ కు రానున్న ప్రసిద్ధ వేద విద్వాంసులు

  • సమన్వయకర్త కంకణాల రాజేశ్వర్ వెల్లడి

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ పట్టణంలోని విద్యానగర్ కాలనీవాసుల ప్రత్యేక ఆహ్వానం మేరకు మార్చ్ 14 శనివారం ఉదయం 10 గంటలకు “హనుమాన్ చాలీసా శతవసంతాల పారాయణ మహోత్సవ” సందర్భాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్‌ పట్టణంలోని విద్యానగర్ కాలనీలోని మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద ఏర్పాటుచేసిన “ఆధ్యాత్మిక అమృత భాషణం మహాసభ” కు అంకాపూర్ వైదిక ధ్యానయోగ ఆశ్రమం వ్యవస్థాపకులు, సుప్రసిద్ధ కవి, ప్రఖ్యాత వేద విద్వాంసులు, ఖ్యాతినొందిన ధార్మిక రచయిత, అనువాదకులు, మార్గదర్శకులు, చిత్రకారుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వక్త శ్రీశ్రీశ్రీ శ్రీధరానంద భారతీ స్వామి, వైదిక పురోహితులు, ధార్మిక వక్త, గాయకులు, ధర్మ ప్రబోధకులు శ్రీశ్రీశ్రీ వేద పునీతానంద భారతీ స్వామి రాన్నారని కార్యక్రమ వారధి, సమన్వయకర్త, వ్యాఖ్యాత కంకణాల రాజేశ్వర్, విద్యానగర్ కాలనీ ప్రతినిధులు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ఈ శుభ సందర్భంగా ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకులు కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ చాలీసా అనేది 16వ శతాబ్దంలో తులసీదాస్ రాసిన 40 పద్యాల హనుమంతుని స్తోత్రం అని అన్నారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసా చదవడం వలన హనుమంతుని ఆశీస్సులతో కష్టాలు తొలగిపోయి, బలం, బుద్ధి, విద్యను ప్రసాదిస్తుంది అని అన్నారు. మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని వివరించారు.

శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తి కలిగి పూర్తి అర్థంతో, భక్తితో హనుమాన్ చాలీసాను చదివినట్లయితే మెరుగైన ఫలితాలు లభిస్తాయి అని సవివరించారు. కాబట్టి భీమ్‌గల్‌ పట్టణ ప్రజలతో పాటు ఇరుగుపొరుగు గ్రామాల హైందవులు, రామభక్తులు, ధార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించగలరని కంకణాల రాజేశ్వర్, విద్యానగర్ కాలనీ ప్రతినిధులు కోరారు.

Leave a Reply