Gurukulala |ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి..

Gurukulala |ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి..
Gurukulala | మంథని, ఆంధ్రప్రభ : ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ గురుకులాల ప్రవేశ పరీక్షను సద్వినియోగం చేసుకోగలరని పెద్దపెల్లి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శ్రీనాథ్ పేర్కొన్నారు. ఉమ్మడి గురుకులాలు రాష్ట్రవ్యాప్తంగా ఐదవ తరగతి ఉమ్మడి పరీక్ష, 6, 7, 8, 9 తరగతుల మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షను ఈనెల 22 న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నది.
పెద్దపెల్లి జిల్లాలో మొత్తం 8 పరీక్ష కేంద్రాలు కలవు. ఐదో తరగతి పరీక్ష కేంద్రాలు జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలికలు) మల్లాపూర్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల (బాలికలు) నంది మేడారం, మహాత్మ జ్యోతిరావు బాపులే సుల్తానాబాద్ (భూపతిపూర్), ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల /కళాశాల (బాలురు) మంథని, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలికలు) రామగుండం.
ఏడవ తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలికలు) గర్రెపల్లి, మహాత్మ జ్యోతిరావు పూలే (రంగంపల్లి) పెద్దపల్లి, ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాలు మహాత్మ జ్యోతిరావు పూలే సప్తగిరి కాలనీ (గోదావరిఖని), 9వ తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల /కళాశాల (బాలికలు) గర్రెపల్లి ఆయా కేంద్రాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించబడతాయని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
పరీక్ష కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాలని ఆయన వివరించారు. పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు అభ్యర్థులు తమ వెంట ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో, బ్లూ/బ్లాక్ బాయిల్ పాయింట్ పెన్, పరీక్ష ప్యాడ్, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. ఎలక్ట్రికల్ వస్తువులు, డిజిటల్ వాచీలు, వంటివి అభ్యర్థుల వెంట అనుమతించబడవని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు.
