Gurukul | బోధనేతర బాధ్యతల భారం తొలగించాలి

Gurukul | బోధనేతర బాధ్యతల భారం తొలగించాలి
- టీఎస్ డబ్ల్యూఆర్టియు నాయకుడు కె. పాండు నాయక్
Gurukul | అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో(Gurukul schools) పని చేస్తున్న ఉపాధ్యాయులపై పెరుగుతున్న బోధనేతర పనుల భారం వెంటనే ఉపసంహరించాల్సిందిగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం గురుకుల అదనపు కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ) శ్రీమతి బి. గీతను కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు టీఎస్ డబ్ల్యూఆర్టియు నాయకుడు కె. పాండు నాయక్ ఈ రోజు ఆంధ్రప్రభ ప్రతినిధితో తెలిపారు.
గురుకులాల్లో ప్రతి రోజూ ముగ్గురు ఉపాధ్యాయులు పాఠశాలలో రాత్రి బస చేయాలని, ఆదివారాలు కూడా నలుగురు ఉపాధ్యాయులు డ్యూటీ(duty) చేయాలని జారీ చేసిన ఆదేశాలు అన్యాయమని, ఉపాధ్యాయుల వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన వాపోయారు. ఉపాధ్యాయులను “మనుషులుగా గుర్తించి” అట్టి ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని సంఘం స్పష్టంగా డిమాండ్ చేస్తుందని అన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జ్‌లు(black badges) ధరించి తమ నిరసనను తెలుపగా, వివిధ పాఠశాలల్లో జరిగిన ఈ నిశ్శబ్ద నిరసనకు సంఘ నాయకులు సంఘీభావం ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం చైర్మన్ డాక్టర్ జె. రామలక్ష్మయ్య, డీ. బాల స్వామి, కీర్తి రవి, కే. పాండు నాయక్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, బాలీశ్వరయ్య, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
